Wednesday, September 26, 2018

ఆధార్.. అవసరం ఉన్నవి.. లేనివాటి జాబితా AADHAR Essential Not Essential

ఆధార్.. అవసరం ఉన్నవి.. లేనివాటి జాబితా AADHAAR Essential Not Essential where-is-aadhaar-essential-where-is-not-essential
AADHAAR Essential Not Essential where-is-aadhaar-essential-where-is-not-essential

Aadhar Judgment by SC Key takeaways


1. Individuals and corporates cannot collect Aadhaar data

2. Government not to give Aadhaar to illegal immigrants

3. Aadhaar need not be made compulsory for school admissions

4. Linking Aadhaar to telecom services unconstitutional

5. No person can be denied govt benefits only due to absence of Aadhaar

6. No need to link bank accounts, mobile numbers to Aadhaar

7. Aadhaar card is mandatory for PAN linking, Income Tax return

8. Aadhaar can be passed as Money Bill

9. Nothing in Aadhaar Act that violates right to privacy of individual

10. No child can be denied benefits of any schemes on not being able to bring their Aadhaar number

11. CBSE, NEET, UGC cannot make Aadhaar mandatory, also not compulsory for school admissions


ఆధార్‌కు ఉన్న రాజ్యాంగ బద్ధతను కోర్టు సమర్థించింది. అయితే అందులోని కొన్ని నిబంధనలను మాత్రం కొట్టేసింది. ఆధార్ రాజ్యాంగబద్ధమే అయినా.. అది అన్నింటికీ కచ్చితమైతే కాదు.

ఆధార్ వేటికి అవసరం లేదో ఇప్పుడు చూద్దాం.. 


  1. బ్యాంక్ ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదు అని కోర్టు స్పష్టంచేసింది
  2. ఇక మొబైల్ నంబర్లకు కూడా ఇక నుంచి ఆధార్ అవసరం లేదు. గతంలో కొత్త నంబర్ తీసుకోవాలన్నా.. ఇప్పటికే ఉన్న నంబర్లకైనా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అన్న నిబంధన ఉండేది. దీనిని కోర్టు కొట్టేసింది.
  3. ఆధార్ లేదని ఏ విద్యార్థికీ చదువును దూరం చేయొద్దు అని కూడా కోర్టు స్పష్టంగా పేర్కొన్నది. అంతేకాదు స్కూళ్లలో చేపట్టే సామాజిక కార్యక్రమాలన్నీ ఆధార్ లేకున్నా విద్యార్థులందరికీ అందాలని ఆదేశించింది. 
  4. ఇక నుంచి సీబీఎస్‌ఈ, నీట్‌లాంటి పరీక్షలకు ఆధార్ అవసరం లేదని కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది. 
  5. ప్రైవేటు సంస్థలకు ఆధార్ అడిగే హక్కు లేదని, స్కూళ్లతోపాటు ఏ ప్రైవేటు సంస్థా ఆధార్‌ను అడగకూడదని ఆదేశించింది.

ఇక ఆధార్ కచ్చితంగా అవసరమైన సేవలు 


  1. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇప్పటివరకు 21.08 కోట్ల పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. 
  2. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే కూడా ఆధార్ తప్పనిసరి అని కోర్టు తమ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది.
  3. ఇక ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి.