TS DSC 2024 Selection List with Names Download
Telangana State School Education Department Released Teachers Recruitment Notification 2023 called as Telangana DSC 2023 Notification which is very awaiting news for Government Teacher Job aspirants. DSC, District Selection Committee Notification has come out with District wise, Post wise Vacancies details and eligibility criteria for the teacher job aspirants. Here is the day wise schedule for Online Application, Exam Dates. www.schooledu.telangana.gov.in is the official website to search for the Telangana DSC Official Notification, Vacancies Eligibility details for the Teacher Recruitment candidates. TRT Telangarla Direct Recruitment for the posts of Teachers (Scheme of Selection) Rules, 2023- Notilication - Orders
Telangana DSC Results 2024 Live : తెలంగాణ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (Telangana DSC GRL) ఈరోజు (సెప్టెంబర్ 29) ఉదయం TS DSC 2024 Results విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పటికే టీజీ డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో చెక్ చేసుకోవచ్చు. TS DSC 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
రాష్ట్రంలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా.. ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ సారి DSC పరీక్షలు రాశారు.
మొత్తం పోస్టులు ఇలా..
2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండిట్ పోస్టులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులను అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. దసరాలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
దసరాలోపు ఫైనల్ లిస్ట్
ఫలితాలు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. " చాలా తక్కువ సమయంలో ఉద్యోగాలు అందేంచేందుకు అధికారులు చాలా శ్రమించారు. ఈ ఫలితాలు 1:3 ప్రాతిపదికను విడుదల చేశాం. ఇప్పుడు అధికారులు అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫై చేయాలి. ఫైనల్ ఫలితాలు దసరా లోపు విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లో నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. అని స్పష్టం చేశారు