Wednesday, January 18, 2017

What Next After SSC/10th Class-Complete Educational Guidance

What Next After SSC/10th Class-Complete Educational Guidance | How to Choose Courses after 10th Class | How to Choose Intermediate Courses | What are the Vocational Courses offered by Board of Intermediate in Telangana and Andhra Pradesh | What about Polytechnic Courses | Educational Rout Map for SSC Students | Agriculture Polytechnic Courses Complete suggessions to SSC Students | IIIT Courses for SSC Passed Students | Complete Entrance Details like TSRJC CEEP what-next-after-ssc-10th-class-complete-educational-guidance


పదితో పదిలమైన కోర్సులు:
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పదో తరగతి 2023 ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. పది తర్వాత పదిలమైన కోర్సు ఏది.. ఏ కోర్సులో చేరితే తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసకోవచ్చనేది విద్యార్థుల్లో మెదిలే ప్రశ్న.. తోటి విద్యార్థులు, స్కూల్ క్లాస్ మేట్స్, మీకాలనీ వారు లేదా బంధువులు ఇలా అందరూ తీసుకునే కోర్సే మనం కూడా తీసుకుందాంలే.. అని అనుకోకండి.. మీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేది పదో తరగతి తర్వాత చేరబోయ కోర్సు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇంటర్మీడియట్ అనేది విద్యార్థుల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ .. ఇంటర్ లో తీసుకునే కోర్సు ఆధారంగానే వారి కెరీర్ ఆధారపడి ఉంటుంది. అందుకే


ముందుగానే విద్యార్థులకు ఏ సబ్జెక్టులో ప్రావీణ్యం ఉందో తేల్చుకోవాలి. . దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఏ రంగంలో ఆసక్తి ఉంది అనేది తెలుసుకోవాలి... ? ఉదాహరణకు లాయర్, డాక్టర్, ఇంజనీర్, ప్రభుత్వ సర్వీసులు, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి అనేక రంగాలున్నాయి. విద్యార్థులకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలసుకుని సంబంధిత గ్రూపు తీసుకుంటే వారికి మంచి కెరీర్ ఉంటుంది. చాలా తేలిగ్గా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇంటర్‌లో ఉండే వివిధ గ్రూపులు, పాలిటెక్నిక్, ప్రత్యేక డిప్లొమాలు, ఒకేషనల్‌ విద్య, ఐటీఐ.. కోర్సుల వివరాలు తెలుసుకుందాం..

ఇంటర్‌ గ్రూపులు:
ఎంపీసీ గ్రూపు:

ఇంజనీర్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. ఇంటర్ తర్వాత ఐఐటీ, ఎన్ఐటీ, ఎంసెట్, జేఈఈ మెయిన్, బిట్‌శాట్ .. ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకు సాధించడం ద్వారా టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సంపాదించవచ్చు. దీనిక ఇంటర్ నుంచే సరైన పట్టు ఉండాలి. అప్పుడే ఇటువంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు వస్తుంది. ఎంపీసీ తర్వాత బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి.. పరిశోధనలు చేసే స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి.

బైపీసీ:

బైపీసీ గ్రూపులో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సినది ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూపు. బైపీసీ తర్వాత నీట్, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా స్థిరపడవచ్చు.

సీఈసీ, ఎంఈసీ:

ప్రస్తుత కార్పొరేట్ యుగంలో ఈ కోర్సులకు చాలా డిమాండ్‌ ఉంది. వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారు సీఈసీ, ఎంఈసీ గ్రూపులను ఎంపిక చేసుకోవచ్చు. కామర్స్‌లో నైపుణ్యాలున్న వారు చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు ఈ గ్రూపులు అనుకులమైనది.

హెచ్‌ఈసీ: ఇంటర్ హెచ్‌ఈసీ గ్రూపులో హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌/కామర్స్‌ సబ్జెక్టులుంటాయి. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు..ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి.

ఐటీఐ/ఐటీసీ :

సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. మూడు నెలల నుంచి మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులు చదవవచ్చు. ఈ కోర్సులు పూర్తయ్యాక అప్రెంటీస్‌గా పనిచేయవచ్చు. ఈ విధమైన కోర్సులను పూర్తిచేసిన వారికి రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

పాలిటెక్నిక్:

ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. సత్వర ఉపాధి పొందేందుకు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను ఎన్నుకోవచ్చు. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్యకు ఈ కోర్సులు బలమైన పునాదులు వేస్తాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. దీనికి ECET రాయాల్సి ఉంటుంది. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.

మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సులు:
సివిల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

ఆటోమొబైల్ ఇంజనీరింగ్

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సులు:
కంప్యూటర్ ఇంజనీరింగ్

ఎంబెడెడ్ సిస్టమ్స్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు: (కోర్సు కాలం - రెండేళ్లు):
దీనిలో మూడు రకాల కోర్సులుంటాయి.

1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్

2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ

3. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా

ప్రవేశాలు పొందాలంటే పదో తరగతి మాత్రమే అర్హత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. దీనికి అగ్రి పాలీసెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ అర్హత పరీక్షలో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగవకాశాలుంటాయి.

ఒకేషనల్ కోర్సులు:
ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సులు ఇవి. ఆరు కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.

ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి:
ఇంజనీరింగ్, ‌‌టెక్నాలజీ కోర్సులు వీటిల్లో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం ఈ కోర్సులు చదివిన ఐటీఐ విద్యార్ధులకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.


What Next After SSC/10th Class-Complete Educational Guidance | How to Choose Courses after 10th Class | How to Choose Intermediate Courses | What are the Vocational Courses offered by Board of Intermediate in Telangana and Andhra Pradesh | What about Polytechnic Courses | Educational Rout Map for SSC Students | Agriculture Polytechnic Courses Complete suggessions to SSC Students | IIIT Courses for SSC Passed Students | Complete Entrance Details like TSRJC CEEP what-next-after-ssc-10th-class-complete-educational-guidance

Here Courses Details after SSC/10th Class   1. How to Choose Intermediate Courses
  2. What About Polytechnic
  3. About ITI
  4. About Agriculture Polytechnic
  5. Vocational Courses
  6. Download Information as PDF FIle