Thursday, March 7, 2019

Happy Women's Day - మహిళా ఉద్యోగులకు మాత్రమే...

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మాత్రమే ప్రత్యేకం


# పురుషులు తో పోల్చిన మహిళా టీచర్లకు 5 CL లు అధికం.
(G.O.Ms.No.374, Edn, Dt:16-3-1996)


# ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే 14 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.1415, M&H, Dt:10-06-1968)


# మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయిన రెండవ ఆపరేషన్ కు కూడా 14 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.124, F&P, Dt:13-04-1982)


# లూప్ వేయించుకొన్న రోజు స్పెషల్ CL ఇస్తారు.
(G.O.Ms.No.128, F&P,Dt:13-04-1982)


# ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజెషన్ చేయించుకున్న  ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.102,M&H,Dt:19-02-1981)


# గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.52, Fin,Dt:1-04-2011)


# 180 రోజులు ప్రసూతి సెలవు ఇస్తారు. ఇది ఇద్దరు జీవించి యున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
(G.O.Ms.No.152, Fin,Dt:04-05-2010) &
(G.O.Ms.No.38, F&P, Dt:13-08-1992)


# సమ్మర్ హాలిడేస్ లో ప్రసవించిన , ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు.
(G.O.Ms.No.463,Edn,Dt:04-05-1979)


# అబార్షన్ ఐనచో 6 వారాలు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.762,M&H,Dt:11-08-1976)


# వివాహం కొరకు 75,000 అప్పుగా ఇస్తారు.దీనిని 70 వాయిదాల లో తిరిగి  5.50% వడ్డీ తో సహా చెల్లించాలి.
(G.O.Ms.No.39 F&P,Dt:15-04-2015).


# ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది
*(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)*


# ఉద్యోగకల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.
*(G.O.Ms.No.27 తేది:09-01-2004)*


# మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.
*(G.O.Ms.No.350 తేది:30-07-1999)*


# అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.
*(Memo.No.17897 తేది:20-04-2000)*


# పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ
ఉత్తర్వులు.
*(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)*


# ఎస్.ఎస్.సి సర్టిఫికేట్లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.
*(మెమో.నం.7679 తేది:14-09-2010)*


# మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.
*(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)*


# మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
*(G.O.Ms.No.374 తేది:16-03-1996)*


# జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.
*(G.O.Ms.No.03 తేది:05-01-2011)*


# వివాహం ఐన మహిళా ఉద్యోగికి క 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది.
*(G.O.Ms.No.152 తేది:04-05-2010)* nizam


# మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*
*(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)*


# మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)*


# ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)*


@ మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)*


& చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
*(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)*


& మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.
*(G.O.Ms.No.132 తేది:06-07-2016)