Friday, October 31, 2014

FINAL GUIDLINES FOR EMPLOYEES ALLOCATION FROM GOVT OF INDIA




Bifercation of Andhra Pradesh | Allocation of Employees | Guidlines to Allocation of Employyes for both States AP and Tealngana State | Central Home Ministry has released Final Guidline for Allocation of Employees 


 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. ఈమేరకు ఇవాళ రెండు రాష్ర్టాల అధికారులతో భేటీ అయిన కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది. రెండు రాష్ర్టాల ప్రభుత్వాలకు ఈ మార్గదర్శకాలను అందజేశారు. తుది మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్ ఉంచారు. కమిటీ వెల్లడించిన మార్గదర్శకాలు...

మార్గదర్శకాలు:
  1. - రివర్స్ ఆర్డర్ ఆఫ్ సీనియారిటీ ఆధారంగా ఖాళీల భర్తీ
  2. - జూన్ 1, 2014 వరకు అందుబాటులో ఉన్న సీనియారిటీ జాబితా ప్రకారం ఉద్యోగుల పంపిణీ
  3. - రెండు రాష్ర్టాలు కోరుకుంటే ఖాళీగా ఉన్న పోస్టులకు రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ
  4. - సెలవుల్లో ఉన్నవారు, రిటైర్డ్ అయినవారు, సస్సెండ్ అయినవారు, డిప్యూటేషన్‌లో ఉన్నవారికి కూడా విభజన వర్తిస్తుంది
  5. - ఆప్షన్లను పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల కేటాయింపు ఉంటుంది
  6. - అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, ఉమ్మడి రాజధాని పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఆప్షన్లు వర్తించవు
  7. - ముందుగా స్థానికత, సీనియారిటీ ప్రకారం కేటాయింపులు
  8. - స్థానికతపై తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవు